Wednesday, August 6, 2025

బెట్టింగ్ యాప్ కాదు..గేమింగ్ యాప్:విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

తాను ఎటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని, లీగల్ గేమింగ్ యాప్ ప్రమోట్ చేశానని సినీనటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయానికి బుధవారం ఆయన విచారణకు హాజరైయ్యారు. ఇడి ఆయన్ను నాలుగు గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనడంపై స్పందించారు. గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు సంబందం లేదని, గేమింగ్ యాప్ అనేవి చట్టబద్దమైనవి అని తెలిపారు. దేశంలో బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ఇలా రెండు రకాలుగా ఉన్నాయని వివరించారు. ఏ23 అనే గేమింగ్ యాప్‌కు ప్రమోషన్ చేశానని,

ఈ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని ఆయన వెల్లడించారు. ఈ గేమింగ్ యాప్ ఇండియా క్రికెట్ టీం, ఇండియా వుమెన్స్ క్రికెట్ టీం, ఒలంపిక్ టీం, ఐపీఎల్, కబడ్డీ టీంలకు స్పానర్సర్ చేస్తాయని చెప్పారు. గేమింగ్ యాప్స్ పలు రాష్ట్రాల్లో లీగల్ అని, ఈ యాప్స్‌కి జిఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయన్నారు. ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పానని, బ్యాంక్ లావాదేవీలు అన్ని ఇడికి అందచేశానని, గేమింగ్ కంపెనీతో చేసుకున్న ఒప్పంద వివరాలు అధికారులు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. చట్టబద్దమైన గేమింగ్ యాప్స్‌కు మాత్రమే ప్రమోట్ చేసినట్లు ఇడి అధికారులకు స్పష్టం చేశానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News