- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడుతున్నాడు. అత్యధిక పరుగుల రేసులో ప్రస్తుతం అతను రెండో స్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లీ ఆట తీరుపై స్ర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయే మంజ్రేకర్ మాత్రం కోహ్లీ గురించి వ్యతిరేకంగా చూపించారు. బెంగళూరు-ముంబైకి మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీ-బుమ్రాల పోరును బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని అనలేమని మంజ్రేకర్ పేర్కొన్నారు.
ఐపిఎల్ 2025 నుంచి టాప్ బ్యాటర్లలో కోహ్లీకి స్థానం కల్పించలేదు. ఈ సీజన్‌లో విరాట్ స్ట్రైక్ రేటుపై కూడా మంజ్రేకర్ కామెంట్ చేశారు. దీనిపై విరాట్ సోదరుడు వికాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్డేల్లో 64 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేసిన మంజ్రేకర్ కూడా 200+ స్ట్రేక్‌రేటుతో ఆలవోకగా పరుగులు చేసే వాళ్ల గురించి చులకనగా మాట్లాడుతారా’ అని వికాస్ అన్నారు.
- Advertisement -