Wednesday, April 24, 2024

భారత్ మధ్యవర్తిత్వం చేస్తే స్వాగతిస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ రాయబారి అలీ చెగేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం భారత్ ప్రయత్నిస్తే స్వాగతిస్తామని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే దేశాలలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చర్చల కోసం భారత్ చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీలో ఇరాన్ ఎంబసీ నిర్వహించిన సులేమానీ సంతాప సభలో పాల్గొన్న అలీ చెగేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. ఇరాన్ అమెరికాల మధ్య శాంతికి ఏ దేశం ప్రయత్నించినా స్వాగతిస్తామని, అలాగే భారత్-ఇరాన్ మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా భారత్ మరింత చొరవ తీసుకోవాలని కోరారు.

We aren’t looking for war with US: Iran Ambassador

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News