Friday, April 19, 2024

ఆకాశమే.. 100పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం

- Advertisement -
- Advertisement -

Municipalities

 

బిజెపివి ఒఠ్ఠి బూటకాలు
అది బి ఫాం ఇస్తామన్నా ఎవరు తీసుకోవడం లేదు
కొత్త మున్సిపల్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం
కౌన్సిలర్లు తప్పు చేస్తే తొలగించడానికి వెనుకాడం
అధికారులను సైతం సస్పెండ్ చేస్తాం : మీడియాతో కెటిఆర్

హైదరాబాద్ : బిజెపి పార్టీవి ఒట్టిమాటలే, వాళ్లకు బలం లేదు, ఆ పార్టీ బీఫామ్ ఇస్తామన్నా ఎవరూ తీసుకోవడం లేదు, అడ్డిమార్ గుడ్డి దెబ్బన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపి సీట్లు గెలుచుకుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి, రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై మంగళవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని, వందకు పైగా మున్సిపాల్టీలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి లాగే పట్టణ ప్రగతిపై కూడా చిత్తశుద్ధితో ఉన్నామని, కొత్త మున్సిపల్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌన్సి లర్లను తీసేయాల్సి వస్తే తమ పార్టీ నుంచే మొదలు పెడతామని, తప్పు చేస్తే అధికారులను కూడా సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.

ఎపి మూడు రాజధానుల అంశం ఆ రాష్ట్ర ప్రజల పరిధిలోనిది…
మున్సిపల్ అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని, 2009 నుంచి టిఆర్‌ఎస్ ఇదే విధానం పాటిస్తోందన్నారు. రెబల్స్ ఎక్కువగా ఉండటం వల్ల తమ పార్టీ బలానికి నిదర్శనమన్నారు. రెబల్స్ సమస్య 90 శాతం పరిష్కారమయ్యిందని, మిగతా 10 శాతం మందిని బుజ్జగిస్తామన్నారు. కాంగ్రెస్ తమ సమీప ప్రత్యర్థి అని, కాంగ్రెస్ ఓట్ల శాతం పరంగా తమ పార్టీకి చాలా దూరంలో ఉందన్నారు. పట్ణణాల్లో ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చిందని, అభివృద్ధి పనులు చేసి చూపించామన్నారు. విద్యుత్, మంచినీటి సమస్యల్ని దూరం చేశామని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాలిస్తున్నామన్నారు.

అందుకే హైదరాబాద్‌లో ఘన విజయాలను సొంతం చేసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళితే అక్కడి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారన్నారు. పొరుగువారితో ఎప్పుడూ సత్సంబంధాలే పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు గతంలో ఇబ్బంది పెట్టాలని చూశారని, తాము ఎప్పుడూ ఆయన్ను అవమానించలేదన్నారు. ఎపిలో 3 రాజధానుల అంశం ఆ రాష్ట్ర ప్రజల పరిధిలో ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
తెలంగాణ భవన్‌లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాల్లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పాల్గొని తెలంగాణ భవన్‌పై పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలను రంగు రంగుల ముగ్గులతో ముస్తాబు చేశారు. కార్యాలయ ఆవరణం అందమైన రంగవల్లులతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, మేయర్ బొంతు రాంమ్మోహన్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, టిఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

We win over Hundred Municipalities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News