Saturday, July 27, 2024

ఏకగ్రీవ గుబాళింపు

- Advertisement -
- Advertisement -

Unanimous in Municipality wards

 

ముందే పలు వార్డులు కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్

పరకాలలో ఏకంగా 11వార్డులు , కారెక్కినవి మొత్తం 53

హైదరాబాద్ : పురపోరులో పోలింగ్ ప్రక్రియకు ముందే అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ ఖాతాలోకి అప్పుడే పలు వార్డులు చేరిపోయాయి. రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఈ నెల 22 ఎన్నికలు జరగనున్నాయి. కాగా మంగళవారం అభ్యర్ధుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో పలు వార్డుల్లో నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్ధులు రంగం నుంచి తప్పుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా రాత్రి 9 గంటల సమయంలో అందిన వివరాల ప్రకారం ఏకగ్రీవ విజయాల్లో టిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. ఏకగ్రీవాలలో దాదాపుగా 53 వార్డులను గులాబీ పార్టీ ఇప్పటికే దక్కించుకుంది.

ఏకగ్రీవాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని 4 పురపాలికల్లో 6 వార్డులను దక్కించుకుంది. ఇందులో మహబూబాబాద్ 17వ వార్డులో పార్టీ అభ్యర్థి పుష్పలత, డోర్నకల్ ఐదో వార్డులో పార్టీ అభ్యర్థి వాంకుడోత్ వీరన్న, మరిపెడ 8వ వార్డులో బానోత్ కిషన్, 9వ వార్డులో వీసారపు ప్రగతి, మహబూబ్‌నగర్ తొర్రుర్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో జినుగ సురేందర్ రెడ్డి, 13వ వార్డులో గుగులోత్ శంకర్, మహబూబ్‌నగర్ పురపాలికలోని 5వ వార్డులో అభ్యర్థి వనజ, కోస్గి మున్సిపాలిటీలోని 10వ వార్డులో అనిత, వనపర్తి మున్సిపాలిటీలోని 5వ వార్డులో శాంత, అలంపూర్ మున్సిపాలిటి 5వ వార్డులో దేవన్నలు ఏకగ్రీవమయ్యారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో నాలుగు వార్డులు టిఆర్‌ఎస్‌కు ఏకగ్రీవంగా దక్కాయి. ఇందులో 19వ వార్డు కౌన్సిలర్‌గా అన్నారం శ్రీనివాస్, 34వ వార్డు అభ్యర్థి దార్ల కీర్తన, 36వ వార్డు అభ్యర్ధి కల్లూరి రాజు, 5వ వార్డు అభ్యర్థి డి.అరుణలు ఏకగ్రీవమయ్యారు.

అలాగే చెన్నూరులో 18 వార్డులకు గానూ 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 2వ వార్డులో -కమ్మల శ్రీనివాస్, 5వ వార్డులో హరి,10వ వార్డులో -అర్చన, 11వ వార్డులో -స్వర్ణలత, 13వ వార్డులో నవాజుద్దీన్, 14వ వార్డులో స్రవంతి, 18వ వార్డులో అభ్యర్థి శాంతారాణిలు ఏకగ్రీవమయ్యారు. సత్తుపల్లి పురపాలికలో 23 వార్డులకు గానూ 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 4, 5, 6, 8, 17, 18 వార్డుల్లో అధికార టిఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి. వైరా పురపాలికలో 3వ వార్డు అభ్యర్థి పద్మజ, మేడ్చల్ జిల్లా పోచారం పురపాలికలో ఇద్దరు టిఆర్‌ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల పురపాలికలోని 11 వార్డుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

ఇందులో 6వ వార్డు అభ్యర్థి దామెర మొగిలి, 7వ వార్డు అభ్యర్థి జ్యోతి అనిల్ కుమార్, 8వ వార్డు అభ్యర్థి అడప రాము, 9వ వార్డు అభ్యర్థి మల్లేశం 10వ వార్డు అభ్యర్థి లావణ్య రమేశ్, 12వ వార్డు అభ్యర్థి రాణి రమాదేవి, 13వ వార్డు అభ్యర్థి రజనీ నవీన్, 15వ వార్డు అభ్యర్థి సుజాత తిరుపతి రెడ్డి, 16వ వార్డు అభ్యర్థి రమాదేవి, 17వ వార్డు అభ్యర్థి పాలకుర్తి గోపి, 20వ వార్డు అభ్యర్థి సోదా అనితనిర్మల్ తదితరులు ఉన్నారు. పురపాలికలో 33వ వార్డు ఈశ్వర్, 10వ వార్డులో సబిత ఏకగ్రీవం అయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పురపాలికలో 9వ వార్డులో అభ్యర్థి తొట్ల సంపత్ ఏకగ్రీవమయ్యారు.

జవహార్‌నగర్ కార్పొరేషన్‌లో 17వ వార్డు అభ్యర్ధి చిత్ర సుబ్రహణ్యం, వికారాబాద్ మున్సిపాలిటీలో 14వ వార్డులో చింతకింది రామస్వామి, 25వ వార్డులో చిగుళ్ళపల్లి మంజూల రమేష్, నాగారం మున్సిపాలిటీలోని 7వ వార్డులో గూడూరు సబితా ఆంజనేయులు, దుండిగల్ మున్సిపాలిటీలో 21వ వార్డులో ఎంబరి లక్ష్మీ, 26వ వార్డులో కృష్ణ, బాన్సువాడ మున్సిపాలిటీలోని 4వ వార్డులో గైక్వాడ్ రుక్ముణి, సుర్యాపేట మున్సిపాలిటిలో 5వ వార్డులో ఎస్‌కె. బాషామియాలు ఏకగ్రీవమయ్యారు.

TRS Unanimous in Municipality wards
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News