Monday, June 5, 2023

వార్డుకు ఐదుగురు

- Advertisement -
- Advertisement -

Nominations

 

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
బరిలో సగటున వార్డుకు ఐదుగురు అభ్యర్థులు

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నాం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఒక్క వార్డుకు ఒక్కటే నామినేషన్ దాఖలైన చోట అభ్యర్థిని ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. సగటున ఒక్కో వార్డుకు ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం మొదలు పెట్టగా సంక్రాంతి పండుగ బుధవారం నాటి నుంచే ఉధృతం చేయనున్నారు. కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 3,052 స్థానాలకు 25,768 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటిలో 432 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 25,336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయని, 19,673 మంది సరిగ్గా నామినేషన్లు వేసినట్లు ఎస్‌ఇసి ప్రకటించింది. ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉన్నారనేది మున్సిపాలిటీల వారీగా రాష్ట్రస్థాయి సమాచారాన్ని బుధవారం ప్రకటించనున్నట్లు ఎస్‌ఇసి తెలిపింది.

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 1092 నామినేషన్లు దాఖలు కాగా 590 మంది ఉపసంహరించుకున్నారు. 497 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3109 నామినేషన్లు రాగా 10884 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో 1225 మంది నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని (కార్పొరేషన్ మినహా) మునిసిపాలిటీలో 1850 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లాలోని మూడ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలకు 1787 నామినేషన్లు రాగా, 647 మంది ఉపసంహరించుకున్నారు. 1140 మంది పోటీలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మునిసిపాలిటీలలో 1321 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 4 మునిసిపాలిటీల్లో 351 మంది బరిలో ఉన్నారు. అధికార పార్టీకి కొన్నిచోట్ల రెబల్స్ బెడద తప్పలేదు. ఈ నెల 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కరీంనగర్ లో మాత్రం 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు 25న పోలింగ్, 27న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

Withdrawal of Nominations Ended
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News