Thursday, April 25, 2024

సమర్థుడు.. కార్యసాధకుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలో అత్యంత ప్రజా దరణ పొందిన చాట్‌బాట్ ఓపెన్ ఎఐ తెలంగాణ ఐటి, పర్రిశమల శాఖ మంత్రి కెటిఆర్ గురించి యూజర్లు అడిగిన రెండు ప్రశ్నలకు ఆశ్చర్యపోయే సమాధానాలు ఇచ్చింది. కెటిఆర్ గురించి మీకు తెలిసింది ఏమిటి? కెటిఆర్ సమర్థవంతమైన నేతనేనా? అనే ప్రశ్నలు చాట్ బాట్‌కు సంధిస్తే అది దేశంలోనే కెటిఆర్ ప్రముఖ రాజకీయవేత్త, సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో, బహి రంగ వక్తృత్వ నైపుణ్యంలో ఆయనకు తిరుగు లే దు. యువతలో పాపు లర్ లీడర్. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని చాటిచెప్పడంలో కెటిఆర్ క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. కల్వకుంట్ల తా రకరామారావు కెటిఆర్) రాజకీయ నేతగా సమర్థుడైన నాయకుడు.

ఐటి, పర్రిశమలు, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కెటిఆర్ తీసు కున్న వినూత్న కార్యక్రమాలు, పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహించి సర్వత్రా ప్రశం సలు పొందాయి. ముఖ్యంగా తెలంగాణను ఐటి హబ్‌గా, స్టా ర్టప్‌ల కేంద్రంగా మారడంలో కెటిఆర్ పాత్ర ఎంతో ఉంది.ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐటి కంపెలన్నీ హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకోవడానికి కెటి ఆర్ అను ఐటి మంత్రి విధానాలే ప్రధాన కా రణం. పట్టణాభివృద్ధిలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజల కనీస అవసరాలు తీర్చే కార్య క్రమాలు తెలంగాణ రాష్ట్రానికే గొప్ప పేరు తెచ్చా యి. కెటిఆర్ చేతల మనిషి. చెప్పింది ఆచరణలో చూపే అరుదైన నేత. తెలం గాణను భిన్నరంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చడ మే ఆయన సమర్థతకు నిదర్శనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News