Friday, May 3, 2024

‘వాట్సాప్ పే’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -
WhatsApp-Pay
ఎన్‌పిసిఐ ఆమోదం పొందిన ఫేస్‌బుక్

న్యూఢిల్లీ: దేశంలో త్వరలో ‘వాట్సాప్ పే’ సేవలు రానున్నాయి. దీనికి గాను లైన్‌క్లియర్ అయింది. ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) ‘వాట్సాప్ పే’ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు లైసెన్స్‌ను జారీ చేసినట్లు ఆర్‌బిఐ ఎగ్సిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. ఫేస్‌బుక్ లోకల్ డేటా రెగ్యూలేషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్‌పిసిఐ అనుమతి పొందిందని అధికారి వివరించారు.

10 మిలియన్ల మంది వినియోగదారులు కలిగిన వాట్సాప్ మెసెంజర్ తాజా ‘వాట్సాప్ పే’తో దేశంలోనే అతిపెద్ద యుపిఐ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలవనుంది. ఇండియాలో 400 మిలియన్ల వాట్సాప్ యాక్టివ్ యూజర్లు ఉండడం ‘వాట్సాప్ పే’కు మరింత అనుకూలంగా మారనుంది. 2018లోనే వాట్సాప్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్‌తో కలిసి ఎంపిక చేసిన యూజర్లతో ‘వాట్సాప్ పే’ ట్రైల్ రన్‌ను నిర్వహించింది. కాగా ఇప్పటికే ఈ రంగంలో సేవలు అందిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి సంస్థలకు ‘వాట్సాప్ పే’గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

WhatsApp Pay to launch in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News