Friday, April 26, 2024

కార్పొరేషన్ బ్యాంక్ లాభం రూ.421 కోట్లు

- Advertisement -
- Advertisement -

Corporation-Bank

హైదరాబాద్ : డిసెంబర్ ముగింపునాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో(అక్టోబర్‌డిసెంబర్) ప్రభుత్వరంగ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం రూ.420.83 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.61 కోట్లుగా ఉంది. అధిక వడ్డీ ఆదాయం, మొండి బకాయిలకు కేటాయింపులు పెంచినప్పటికీ బ్యాంక్ ఈసారి మంచి లాభాలను చూసింది. ఆదాయం రూ.4,112 కోట్ల నుంచి రూ.6,051 కోట్లకు పెరిగింది.

ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ వివరాలను వెల్లడించింది. ఏకీకృత ఆధారంగా బ్యాంక్ నికర లాభం రూ.420.68 కోట్లు నమోదు చేసింది. క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) లేదా మొండి బకాయిలు రూ.19,557 కోట్లు ఉండగా, గతేడాదిలో ఇది రూ.21,921 కోట్లుగా ఉంది. నికర ఎన్‌పిఎ రూ.13,521 కోట్ల నుంచి రూ.6,321 కోట్లకు తగ్గింది. గతేడాదిలో రూ.824 కోట్లతో పోలిస్తే ఈసారి బ్యాంక్ కేటాయింపులు రూ.1300 కోట్లకు పెంచింది.

Corporation Bank Q3 Net jumps to Rs 421 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News