Monday, May 6, 2024

వికలాంగుల వీల్ చైర్ క్రికెట్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 9, 10 తేదీలలో హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియంలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం 4 వేల రూపాయల పెన్షన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టి వారి ఆత్మ గౌరవాన్ని సిఎం కెసిఆర్ పెంచారన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని ప్రవేశపెట్టి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లను, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

దివ్యాంగుల క్రీడలను తెలంగాణ క్రీడా శాఖ ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 17500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. చేతన ఫౌండేషన్, బిడిసి దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీల్ చైర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కు ప్రభుత్వ పరంగా సహాకారం అందిస్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిడిసి దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్యక్షులు శ్రీధర్ కోటేశ్వర్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News