Friday, March 29, 2024

నకిలీ వ్యాక్సిన్లపై డబ్లుహెచ్‌ఒ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

WHO warning on counterfeit Covid-19 vaccines

లండన్ : కరోనా వ్యాక్సిన్లలో నకిలీ వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. నకిలీ కొవిషీల్డ్ వ్యాక్సిన్లను భారత్ లోను, ఉగాండా లోను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అధీకృత వ్యాక్సిన్ సెంటర్ నుంచి నకిలీ వ్యాక్సిన్‌ను తీసుకెళ్లి పలువురికి ఇచ్చినట్టు తేలింది. 5 ఎంఎల్, 2 ఎంఎల్ వయల్స్ 10 డోసులు నకిలీవిగా తేలాయి. నకిలీ కొవిషీల్డ్ బయటపడడంతో వైద్య ఉత్పత్తుల గురించి డబ్లుహెచ్‌ఒ హెచ్చరిక జారీ చేసింది. తమ కంపెనీ 2 ఎంఎల్ వయల్‌లో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం లేదని, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జాబితాలో పేర్కొన్న వ్యాక్సిన్ నకిలీదని సీరం నిర్ధారించినట్టు డబ్లుహెచ్‌ఒ తెలియచేసింది. ఒక వేళ నకిలీ కరోనా వ్యాక్సిన్‌ను గుర్తించినట్టయితే వెంటనే నాశనం చేయాలని డబ్లుహెచ్‌ఒ సూచించింది. ఉగాండాలో దొరికిన నకిలీ కొవిషీల్డ్ వయల్‌లో 5 మిల్లీ లీటర్ల 10 డోసులు ఉన్నాయి. దీనిపై బ్యాచ్ నెంబరు 41212040 , గడువు తేదీ ఆగస్టు 10 అని వ్రాయబడింది. ఇది కూడా నకిలీయేనని డబ్లుహెచ్‌ఒ తెలిపింది. ఇంతకు ముందు అమెరికాలో ఫైజర్, బయోఎంటెక్ నకిలీ కరోనా వ్యాక్సిన్ గురించి డబ్లుహెచ్‌ఒ వెల్లడించింది. అయితే కొవిషీల్డ్ నకిలీ వ్యాక్సిన్ సమాచారాన్ని ఈ ఏడాది జులై, ఆగస్టు లోనే డబ్లుహెచ్‌ఒ పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News