Sunday, June 16, 2024

ఆ షూటర్‌కు డబ్బులెవరిచ్చారు?

- Advertisement -
- Advertisement -

rahul-gandhi

జామియా ఘటనపై రాహుల్ ధ్వజం
మేం పెన్నులిస్తుటే వాళ్లు గన్నులిస్తున్నారు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : జామియా మిలియా కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సిఎఎ వ్యతిరేక ఆందోళన కాల్పులు జరపమని అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌నిఆర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంటు ఆవరణలో జరిగిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా రాహుల్ మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘జామియా షూటర్‌కి డబ్బులు ఎవరు చెల్లించారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై దాడులు చేయడం సరికాదని, మతతత్వ శక్తులు పునరాలోచించుకోవాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బిజెపిపై మండిపడ్డారు. తాము విద్యార్థులకు పెన్నులు ఇస్తుంటే తమ వ్యతిరేక పార్టీ మాత్రం గన్నులు ఇస్తోందని దుయ్యబట్టారు. ఓటింగ్ రోజున(ఫిబ్రవరి 8) ఓటర్లు ఆలోచించి ఓటేయాలని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.

Who Paid Jamia Shooter Says Rahul Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News