Saturday, May 11, 2024

భౌగోళిక సమాచార వ్యవస్థపై 11వ అంతర్జాతీయ కోర్సును ప్రారంభించిన జిఎస్‌ఐటిఐ

- Advertisement -
- Advertisement -

GSITI

 

హైదరాబాద్ : హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జిఎస్‌ఐటిఐ) భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సును జిఎస్‌ఐటిఐ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. ఏటా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటిఇసి) కార్యక్రమం కింద నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్ధిక పురోగతిని ప్రోత్సహించడానికి, నైపుణ్యం కలిగిన నిపుణుల ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. 16 ఐటిఇసి దేశాల నుంచి పద్దెనిమిది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనవరి 31 నుండి ఫిబ్రవరి 29 వరకు జరిగే ఈ కోర్సుకు భూటాన్, బోట్స్వానా, కొమొరోస్, ఇథియోపియా, ఇరాన్, ఇరాక్, లైబీరియా, మడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మంగోలియా, నైజర్, నైజీరియా, రష్యా, దక్షిణ సూడాన్ మరియు టాంజానియా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీధర్ సమక్షంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొని ఈ కోర్సును ప్రారంభించారు.

ఇందులో పాల్గొనేవారికి భౌగోళిక సమాచార వ్యవస్థ, దాని అనువర్తనాల రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వబడుతుంది. తద్వారా ఈ పద్ధతులను వారి డొమైన్‌లో సమర్థవంతంగా వర్తింపజేయవచ్చు. ఈ విధంగా, భారతదేశం తన సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతిక సాధన యొక్క ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని భావిస్తుంది.

 

GSITI started course on Geographic Information Systems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News