Thursday, May 16, 2024

ప్రభుత్వం, కోర్టులు దోషులను కాపాడుతున్నాయి: నిర్భయ తల్లి

- Advertisement -
- Advertisement -

Nirbhaya mother

 

న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. రేపు(శనివారం) ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసి, ఉరిశిక్షకు అన్ని ఏర్పుట్లు చేసి కూడా ఈ డ్రామాలేంటని ఆమె మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. ఒకడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ వేస్తే, మరొకడు నేను మైనర్‌నని కోర్టులో స్టే వేస్తాడు. ఇలా ఎన్నిరోజుల ఈ మానవమృగాలను మేపుతారంటూ ఆశాదేవి కోర్టుపై మండిపడ్డారు. తమ కూతుర్ని దారుణాతిదారుణంగా అత్యాచారం చేసిన ఆ దోషులకు ఉరిశిక్ష పడేంతవరకు విశ్రమించబోమని ఆమె సవాలు చేశారు. ఏడెనిమిదేళ్లుగా తమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆమె విలపిస్తూ తన ఆందోళనను వెల్లడించారు. ఆ దరిద్రుల తరఫున వాదిస్తున్న లాయర్‌ ఏపి సింగ్‌, గవర్నమెంట్‌.. వారిని ఎన్ని రోజులు కాపాడతారో చూస్తామని ఆమె పేర్కొన్నారు.

Government and Courts are protecting Guilty
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News