Saturday, July 27, 2024

దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను కొరటాల ఎవరూ ఊహించని మాస్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈనెల 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక మరోపక్క ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన మ్యూజిక్ కాన్సెర్ట్‌ని చేస్తున్న అనిరుద్ అక్కడ కూడా దేవర సినిమాకు గట్టిగానే హైప్ ఎక్కిస్తున్నాడు. ఇక దేవర మొదటి సాంగ్ ఒక పక్కా మాస్ బీట్‌గా ఉండబోతుందట.

ఈ భారీ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్ తదితరులు నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ రోల్ మీద భీభత్సమైన ఆసక్తిని ఏర్పరచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News