Friday, April 26, 2024

పిల్లల మలేరియా వ్యాక్సిన్‌కు డబ్లుహెచ్‌ఒ సిఫార్సు

- Advertisement -
- Advertisement -
WHO recommendation for pediatric malaria vaccine
ఈ వ్యాక్సిన్ తయారీ గొప్ప విజయంగా ప్రపంచ ఆరోగ్య నిపుణుని ప్రశంస

బాల్టిమోర్ (అమెరికా): పిల్లలకు మొదటి మలేరియా వ్యాక్సిన్ వినియోగించడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అక్టోబర్ 6 న సిఫార్సు చేసింది. చారిత్రక సంఘటనగా ఇది గొప్ప విజయమని ప్రశంసించింది. మస్కిరిక్స్ అన్న పేరుతో పిలిచే ఆర్‌టిఎస్ ,ఎస్ /ఎఎస్ 01 ఆఫ్రికాకు ఆశా కిరణంగా ఆఫ్రికాకు సంబంధించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాంతీయ డైరెక్టర్ మట్సిడిసో మొయితీ అభివర్ణించారు. ప్రపంచం లో ప్రాచీన మైన ప్రాణాంతక మహమ్మారి మలేరియా నుంచి పిల్లలను రక్షించ గలదని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు గురించి చర్చా కార్యక్రమంలో వచ్చిన ప్రశ్నలకు మలేరియా, ప్రపంచ పిల్లల ఆరోగ్య నిపుణులు డాక్టర్ మిరియం కె.లాయుఫెర్ సమాధానాలు ఇచ్చారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటన ఏమిటి ?

గ్లాక్సోస్మిత్‌కిల్న్ తయారు చేసిన మలేరియా వ్యాక్సిన్‌ఆర్‌టిఎస్. ఎస్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిపార్సు చేసిన మొదటి మలేరియా వ్యాక్సిన్ ఇదే. మలేరియాతో అత్యధికంగా బాదపడే మాలవీ, కెన్యా, ఘన అనేమూడు సబ్ సహరాన్ దేవాల్లో రెండేళ్ల పాటు ఈ వ్యాక్సిన్ పై ప్రయోగాత్మకంగా సమీక్షించడమైంది. అత్యంత జాగ్రత్తగా సమీక్షించిన తరువాత విస్తృతంగా చర్చించి ఈ వ్యాక్సిన్‌ను ఒక మాదిరి నుంచి ఎక్కువ పీడిత దేశాల్లోని పిల్లలకు వినియోగించడానికి సిఫార్సు చేయాలని డబ్లుహెచ్‌ఒ నిర్ధారించింది.

ఇదెందుకు కీలక ప్రగతిగా పరిగణిస్తున్నారు ?

మలేరియా ముఖ్యంగా సబ్ సహరాన్ ఆఫ్రికాలో ఏటా కొన్ని వందలు, వేల మంది పిల్లల్ని పొట్టనపెట్టుకుంటోంది. పరిశోధకులు , వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, విధాన కర్తలు, అడ్వకేట్స్ విజయవంతంగా క్లినికల్‌ట్రయల్స్ నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. ఇది మామూలుగా అనుమతి పొందడమే కాదు, డబ్లుహెచ్‌ఒ సిఫార్సు కూడా పొందింది. మరణానికి దారి తీసే తీవ్రమైన మలేరియా కేసులను 30 శాతం వరకు ఈ వ్యాక్సిన్ నివారించ గలుగుతుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ అత్యంత సమర్ధంగా పలితాలు చూపించిందని పరిశోధకులు గ్రహించినప్పటికీ , సబ్ సహరాన్ ఆఫ్రికా దేశాల్లో ఈ నాలుగు డోసుల వ్యాక్సిన్ భద్రత కలిగిస్తుందా లేదా అన్నది ప్రశ్న. కానీ మాలవీ , కెన్యా, ఘన దేశాలలో 2019 నుంచి చేపట్టిన మలేరియా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. భద్రత కూడా కల్పించ గలిగింది. ఇప్పటివరకు ఈ మూడు దేశాల్లో దాదాపు 8 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు.

ఎందుకింత ప్రాణాంతకంగా మారింది ?

వ్యాధికారక దోమల నుంచి వచ్చే మలేరియా వల్ల ఏటా 5 లక్షల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా సబ్ సహరాన్ ఆఫ్రికాలో పిల్లలకు ఇది ప్రాణగండంగా తయారైంది. అత్యంత పేద కుటుంబాలను ఇది పీడిస్తోంది. కనీస ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాలు, జుమ్మని దోమలు దాడి చేసే వీలున్న ఇళ్లల్లోకి, నీటి వాడకం అస్తవ్యస్థంగా ఉన్న ప్రాంతాల్లో దోమల స్థావరాలుగా ఉండడం, మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ మలేరియా భారం పెరుగుతూనే ఉంది.

ఇతర వైద్యచికిత్సలతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిన ట్రయల్స్ డేటా నివేదికల ప్రకారం వైద్యసర్వీసులు పరిమితంగా ఉన్నప్రాంతాల్లోని పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ అందుతుంది. తేలికపాటి నుంచి మలేరియా ఎక్కువ రిస్కు ఉన్న పిల్లలకు ఇది చేరి ప్రాణగండం నుంచి తప్పించ గలుగుతుంది. వ్యాధిని నయం చేయడం కన్నా వ్యాధి రాకుండా నివారించడం చాలా ముఖ్యం. మలేరియా నివారణకు ఉపయోగించే ఔషధాలు అనేక సార్లు ఇస్తుండాలి. అది చాలా ఖర్చుతో కూడినదే కాకుండా, అసౌకర్యం కూడా. దీనికి తోడు తరచుగా ఔషధం వాడితే మలేరియా పరాన్నజీవి ఆ ఔషధాన్ని ప్రతిఘటించే శక్తిని పెంచుకుంటుంది.

వ్యాక్సిన్ తయారీకి ఎందుకు చాలా కాలం పట్టింది ?

మలేరియా వ్యాక్సిన్ తయారీకి సరైన శ్రధ్ద తీసుకోలేక పోడానికి రాజకీయ వైఖరే కారణం. స్థిరమైన నిర్ణయం తీసుకోలేక పోడానికి రాజకీయమే కీలక పాత్ర వహిస్తుంది. అనేక ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న అమెరికా వంటి దేశాల్లో మలేరియా వ్యాక్సిన్‌కు సరైన మార్కెట్ లేదు. వ్యాక్సిన్ తయారీకి ఫార్మాకంపెనీలకు బలమైన ఆర్థిక ప్రోత్సాహం కానీ రాయితీలు కానీ లేవు. మలేరియా పరాన్నజీవి చాలా సంక్లిష్టమైనది. వ్యాధినిరోధక వ్యవస్థ లక్షాలు వైవిధ్యం. అందువల్ల మలేరియా వ్యాక్సిన్‌ను తయారు చేయడం అంత సులువు కాదు. ఒక మలేరియా స్రైయిన్‌ను నివారించే వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో తయారు చేస్తే అది సాధారణంగా ఇతర రకాల మలేరియా స్ట్రెయిన్లకు పనిచేయక పోవచ్చు. ఆర్‌టిఎస్. ఎస్ చాలా మంచి వ్యాక్సిన్ అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్ల నుంచి ౩౦ శాతం మాత్రమే రక్షించ గలుగుతుంది. కొవిడ్ వ్యాక్సిన్‌తో పోల్చుకుంటే వ్యాక్సిన్లు తయారైనప్పటికీ కొత్త డెల్టా వేరియంట్‌ను పూర్తిగా నివారించ లేక పోతున్నాయి. అదే మలేరియా విషయాన్ని పరిశీలిస్తే అనేక వేరియంట్లు, అనేక ప్రొటీన్లు ఉన్నాయి. వీటన్నిటినీ నివారించే వ్యాక్సిన్‌ను తయారు చేయడమంటే పెద్ద సవాలే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News