Monday, April 29, 2024

నేరాభియోగాలను బట్టే బెయిల్

- Advertisement -
- Advertisement -
SC Guidelines On Granting Bail On Filing Of Charge Sheet
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని అన్ని ఆలోచించిన తరువాతనే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హత్యకేసులో నిందితులైన ఇద్దరికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు వెలువడ్డ అభియోగాలను పరిగణనలోకి తీసుకుని తీరాలి. నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు ఇవ్వాలనేది వారి తరఫు లాయర్ల తాపత్రయంగా ఉంటుంది. అయితే ఎటువంటి కేసు? ఇందులో ఎంతటి బలీయ అభియోగాలు నిందితులపై దాఖలు అయ్యాయనేది చూసుకోవల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న సమాచారం ప్రాతిపదికన చూసుకుంటే బెయిల్ మంజూరీ విషయంలో సంబంధిత హైకోర్టు ఈ కేసుకు సంబంధించి నిర్ధేశిత పద్ధతులను , నియమావళిని పాటించిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని, వీటిని తాము నిర్థారించుకోవల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాధారణంగా తమ ముందుకు వచ్చే కేసులలో బెయిల్ ఇవ్వడం అనేది చూసుకునే ముందు న్యాయస్థానాలు తప్పనిసరిగా ఆయా కేసుల వెనుక ఉన్న ఘటనాతీవ్రత, నిందితులపై మోపబడి ఉన్న అభియోగాల మోతాదులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News