Tuesday, October 15, 2024

మెదక్ మున్సిపల్ కమిషనర్‌పై భార్య ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మెదక్ మున్సిపల్ కమిషనర్ రెండో వివాహం చేసుకున్నాడని అతడి భార్య ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కు కమిషనర్ జానకిరామ్, అతడి భార్య కళ్యాణి రావడంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత ఇంటి వద్ద వివాదం గురించి మాట్లాడుకుంటామని కమిషనర్ భార్య కళ్యాణి పోలీసులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ నుంచి పంపించినట్లు తెలిసింది. కమిషనర్ జానకిరామ్ ఇబ్బంది పెడితే వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అతడి భార్యకు ఓయూ పోలీసులు సూచించారు. జానకిరామ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News