Thursday, May 16, 2024

వీర్యంపై హక్కు భార్యదే తండ్రిది కాదు

- Advertisement -
- Advertisement -

Wife Only Having Right Over Dead Man's Frozen Sperm

 

కోల్‌కతా : మృతుడి వీర్యంపై హక్కు కేవలం భార్యకే ఉంటుంది. తండ్రి కానీ ఇతరులు ఎవరు కానీ దీనిపై ఎటువంటి అధికారాన్ని సంతరించుకోవడానికి వీల్లేదు. ఈ అంశాన్ని ఓ పిటిషన్ దశలో కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఘనీభవ రూపంలో ఉన్న కుమారుడి వీర్య కణాన్ని పొందే అవకాశం తనకు కల్పించాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కుమారుడు కాబట్టి వీర్యానికి సంబంధించిన హక్కు తనకు ఉంటుందని వ్యాజ్యంలో తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. సంబంధిత వ్యక్తి వీర్యంపై హక్కు కేవలం భార్యకు ఉంటుందని, ఏ ఇతర వ్యక్తికి ఉండదు ఉండబోదని తేల్చిచెప్పింది. కోర్టుకెక్కిన ఈ వీర్యం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో భద్రంగా ఉంది.

తండ్రి కొడుకు సంబంధాన్ని చూపి పిటిషనరు ఈ వీర్యం హక్కు సాధించుకోవడానికి వీలు లేదని , ఇటువంటి ప్రాధమిక హక్కు ఆయనకు సంక్రమించలేదని న్యాయమూర్తి సవ్యసాచి భట్టాచార్య రూలింగ్ ఇచ్చారు. వితంతువు అయిన తన కోడలుకు దీనిని పొందే హక్కు దక్కినట్లు అయితే కనీసం దీనిని తీసుకునేందుకు వీలు కల్పించేలా ఆమెను ఆదేశించాలని పిటిషనర్ వేడుకున్నారు. ఆమె నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపే ఎన్‌ఒసి అయినా ఇప్పించాలని కోరారు. అయితే ఈ విషయంలో కూడా తాము స్పందించలేమని , పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఆమెను ఈ విషయంలో ఒప్పించడం తమ పరిధిలోకి వచ్చే విషయం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తన కుమారుడి జ్ఞాపకంగా వీర్యం ఉందని, తలసమిమా జబ్బు వచ్చి మృతి చెందాడని , భవిష్యత్తులో పనికి వస్తుందని వీర్యాన్ని ఆసుపత్రిలో భద్రపర్చాడని తండ్రి తెలిపారు. అయితే ఇక్కడ తండ్రి కొడుకు అనుబంధం గురించి తాము పరిశీలించలేమని, సంబంధిత వ్యక్తి భార్య హక్కునే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని న్యాయస్థానం తేల్చిచెప్పి ఈ వ్యాజ్యానికి తన ముగింపు పలికింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News