Saturday, April 27, 2024

విప్రో లాభం రూ.2,456 కోట్లు

- Advertisement -
- Advertisement -
Wipro
గతేడాదితో పోలిస్తే 2.17 శాతం తగ్గింది

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడో త్రైమాసిక ఫలితాలను(అక్టోబర్‌డిసెంబర్) ఐటి దిగ్గజం విప్రో మంగళవారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభం 2.17 శాతం తగ్గింది. అయితే నాలుగో త్రైమాసికంలో ఆదాయం రెండు శాతం పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. కంపెనీ ఒక్కో షేరుకు డివిడెండ్ ప్రకటించింది. డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,456 కోట్లు. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,510 కోట్లుగా ఉంది. త్రైమాసికం ఆధారంగా చూస్తే లాభం 3.79 శాతం క్షీణించింది.

ఆదాయం 2.73 శాతం పెరిగి రూ.15,740 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.15,059 కోట్లుగా ఉంది. ఐటి సేవల ఎబిటా మార్జిన్ 18.4 శాతంగా ఉంది. ఐటి సేవల ఆదాయం 2.2 శాతం పెరిగి 2,094 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితాలను ప్రకటించిన కంపెనీ సిఇఒ అబిదాలి నీముచ్‌వాలా మాట్లాడుతూ, విప్రో వాటాదారులకు ఒక్కో షేరుకు 1 రూపాయ డివిడెండ్ చెల్లిస్తుందని చెప్పారు. గత త్రైమాసికంలో కంపెనీ బాగా పనిచేసింది. భవిష్యత్తులో ఇలాంటి వృద్ధితో కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం కొనసాగిస్తామని అన్నారు.

Wipro Profits Rise to Rs 2456 Crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News