Thursday, April 18, 2024

కేంద్రం ఎన్‌పిఆర్ సమావేశానికి వెళ్లను…

- Advertisement -
Mamata
న్యూఢిల్లీ: జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్)పై జనవరి 17తేదీన కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి తాను వెళ్లడం లేదని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ”నా ప్రభుత్వాన్ని కూల్చాలని వారనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’ అని ఆమె కరాకండిగా చెప్పారు. ఎన్‌పిఆర్‌ను అమలును మొదట్లోనే వ్యతిరేకించిన మమత తాజాగా తన వైఖరిని పునరుద్ఘాటించారు.
పశ్చిమబెంగాల్‌లో ఎన్‌పిఆర్‌ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటే అది తన ప్రాణాలు పోయిన తర్వాతే జరుగుతుందని తేల్చిచెప్పారు. పౌర హక్కులకు రక్షకురాలిగా దీదీ గత వారం తనను తాను పోల్చుకున్నారు. ప్రజల హక్కులను ఎవరైనా ఊడలాక్కోవడానికి వస్తే తాను రక్షకురాలిగా ఉంటానన్నారు. తన మృతదేహం మీదుగానే ఆ పని చేసుకోవచ్చునని తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకూ అది జరుగదన్నారు. తప్పుడు వార్తలకు, వదంతులకు భయపడొద్దు అని 24 సౌత్ పరగణాల జిల్లాలో జరిగిన సభలో మమత బెనర్జీ స్పష్టం చేశారు.
Wont participate in Centres meeting on NPR says Mamata
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News