Friday, March 29, 2024

అల అమరాపురలో…

- Advertisement -
- Advertisement -

 

 

 

వంతెన అనగానే మనకు గుర్తొచ్చేవి మన దగ్గర ఉండే సిమెంట్ పిల్లర్ల బ్రిడ్జిలు. కానీ ‘టేకు బ్రిడ్జి’ అనగానే కట్టెలతో కట్టినవి కూడా ఉంటాయా? అనిపిస్తుంది కదూ! ఇది మయన్మార్‌లోని అమరాపురలో ఉన్న ఈ వంతెనను ‘యూ బేన్ వంతెన’ అంటారు. దీన్ని 1850లో ఏవా రాజ్యంలో మేయర్‌గా ఉన్న యూ బేన్ గీ ఈ వంతెన కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే లాంగ్ తమన్ అనే సరస్సుకి అటూ ఇటూ రెండు ఊర్లు ఉన్నాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలకు కష్టం కావడంతో, పెద్ద పెద్ద టేకు చెట్లను కొట్టి వాటి మొద్దులతో కట్టారు. దీనికి 1,086 మొద్దులతో నీళ్ల లోపల ఏడు అడుగుల లోతులోకి పిల్లర్లలా పాతి కట్టారు. దీని పొడవు 1.2 కిలోమీటర్లు. దీన్ని రెండేళ్ల పాటు నిర్మించారు. ఇప్పుడిది టూరిస్ట్ స్పాట్‌గా మారింది.

 

wooden cross Bridge in Taungthaman Lake in Myanmar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News