Sunday, April 28, 2024

ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి

- Advertisement -
- Advertisement -

khagendra

 

హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న ఖాగేంద్ర గత కొద్ది కాలంగా న్యూమెనియాతో బాధపడుతూ వెంటిలేటర్‌పై వైద్యసేవలు పొందుతున్నాడని, గుండెపోటుతో అసుపత్రిలోనే మృతి చెందాడని ఆయన సోదరుడు మహేశ్‌థాప తెలిపాడు. అయితే ఖాగేంద్ర మరణించిన విషయాన్ని గిన్నిస్ రికార్డు యాజమాన్యం శనివారం నాడు ఉదయం ధృవీకరించింది. ఖాగేంద్ర తన 18వ ఏట (2010) ప్రపంచంలోనే పొట్టి మనిషిగా ‘గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అదే సంవత్సరం జరిగిన నేపాల్ భామల అందాల పోటీలో హల్‌చల్ చేసి విజేతలతో ఫొటోలకు ఫోజిలిచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాడు.

కాగా ‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడుగా రికార్డులు సాధించిన ఖగేంద్ర ప్రపంచంలోనే అత్యంత ఎంతైన శిఖరం నేపాల్‌లోని గుడ్విల్ పర్యాటక శాఖ ప్రచారానికి అంబాసిడర్‌గా ఎంపికై పలు దేశాలు పర్యటించాడు. ఖాగేంద్రకు గిటార్ వాయించడమంటే మహాఇష్టమని, అతని సోదరులతో బైక్‌లో షికార్లు కొట్టేవాడని అతని తండ్రి రూప బహదూర్ వివరించాడు. నేపాల్ టూరిజం అంబాసిడర్‌గా ప్రపంచంలో పలు దేశాలను పర్యటించి అత్యంత పొట్టి అబ్బాయిలను, అమ్మాయిలను కలుసుకుని వారితో ఫోటోలు దిగాడని తెలిపారు.

తన పర్యటనలో భాగంగా భారత్‌ను సందర్శించి దేశంలోని పొట్టి అమ్మాయిలను కలుసుకున్నాడు. ఇదిలాఉండగా నేపాల్ దేశంలో పుట్టిన చంద్ర బహదూర్ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) ఖాగేంద్ర చేతుల్లో గిన్నీస్ రికార్డు కోల్పోయాడు. 2015లో డాంగీ మృతి చెందడంతో ఖాగేంద్ర మళ్ళీ ప్రపంచ రికార్డు దక్కింది. ఖాగేంద్ర 14 అక్టోబర్, 1992లో నేపాల్‌లోని బాగ్‌లంగ్ జిల్లా జన్మించాడు. రూపబహదూర్, ధన్‌మాయాలకు పెద్ద కుమారుడు ఖాగేంద్ర . 2010లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఖాగేంద్ర గిన్నిస్ రికార్డ్‌లో చోటు సంపాదించడంతో పాటు 2011లో ప్రపంచ వ్యాప్తంగా పాపులరయ్యాడు.

World’s shortest man khagendra dead
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News