Friday, April 26, 2024

డిసెంబర్‌లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3 గిడ్డంగులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటను గిడ్డంగుల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… డిసెంబర్ లోనే యాసంగి రైతుబంధు ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని చెప్పారు.

రాబోయే రోజుల్లో రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామన్నారు. మన సాగు ఉత్పత్తులు దేశంలోనే ముఖ్యపాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. రైతు కేంద్రంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోతే రాష్ట్రమే ఖర్చు భరించిందని ఆయన తెలిపారు. గుజరాత్ లో 24 గంటల కరెంట్ ఎందుకివ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్టూ ఎందుకు కట్టలేదు? అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News