Thursday, May 2, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం తగదు

- Advertisement -
- Advertisement -
  • కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే

ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం తగదని ఆయన అన్నారు. ఆమనగల్లు మండలం మేడిగడ్డ తాండాలో ఆదివారం జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్‌లతో కలిసి కేంద్ర మంత్రి పర్యటించారు.

మేడిగడ్డ=శంకర్‌కోండ తాండా రోడ్డులో గల కత్వ వాగుపై ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రూ. 3.10 కోట్లతో చేపడుతున్న వంతేన నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఏడాది క్రితం టెండర్లు పూర్తయినా నేటికి పనులు జరగకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఈలు కృష్ణయ్య, అభిషేక్‌లను పనుల జాప్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం పనులను తోందరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వాగుపై వంతెన లేని కారణంగా తాండాల మధ్య రాకపోకలపై అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక మంది గిరిజనులు ప్రమాదాల బారిన పడినట్లు సర్పంచ్ అంబర్‌సింగ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేసి గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, నాయకులు తిప్పిరెడ్డి రాంరెడ్డి, గోరేటి నర్సింహ్మ, దండు శ్రీను, రాజశేఖర్, లక్ష్మణ్‌రావు, ఎర్రవోలు శ్రీను, వరికుప్పల శ్రీను, పద్మప్రశాంత్, రవి రాథోడ్, సమీప తాండాల ప్రజలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News