Monday, April 29, 2024

సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం

- Advertisement -
- Advertisement -

ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్), జాతీయ పౌరుల పట్టిక(ఎన్‌ఆర్‌సి)లకు వ్యతిరేకంగా వి ది పీపుల్ ఆఫ్ ఇండియా(మనమంతా భారతదేశ పౌరులం) అనే గొడుగు కింద అందరం పోరాడాలని కమిటీ నిర్ణయించింది. భారతీయ రాజ్యాంగంలోని తొలి పలుకులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిద్దామని కమిటీ పిలుపు ఇచ్చింది.

ఇందులో భాగంగా జనవరి నెలలో జాతీయ స్థాయిలో ఆరు నిరసనలు నిర్వహించేందుకు కమిటీ ప్రతిపాదించింది. ఈ సమావేశానికి హాజరైన వారిలో స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్, రాష్ట్రీయ సేవా దళ్ అధ్యక్షుడు గణేశ్ దేవి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, యునైటెడ్ అగెనెస్ట్ హేట్ సభ్యుడు ఉమర్ ఖలీద్, మానవ హక్కుల కార్యకర్తలు హర్ష్ మందర్, మేధా పాట్కర్ తదితరులు ఉన్నారు. జనవరి 3న సావిత్రిబాయి ఫూలే దివస్, జనవరి 8న భారత్ బంద్, జనవరి 12న యువజన దినోత్సవం, జనవరి 17న రోహత్ వేము జయంతి/సామాజిక న్యాయ దినం, జనవరి 26న త్రివర్ణ పతాకంతో ఊరేగింపు, జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

100 organizations unite to protest against CAA-NRC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News