Thursday, April 18, 2024

మదర్సాలో యుపి పోలీసుల బీభత్సం.. వృద్ధ మౌలానాపై దాడి

- Advertisement -
- Advertisement -

లక్నో: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఒక వృద్ధ మౌలానాను, ఆయనకు చెందిన 100 మంది విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ముజఫర్‌నగర్‌లోని మీనాక్షి చౌక్ వద్ద సిఎఎకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగి హింసాకాండ చెలరేగిన దరిమిలా అక్కడ ఒక మదర్సాపై దాడి చేసిన పోలీసులు విధ్యంసం సృష్టించడమే కాక అక్కడి మౌలానాతోపాటు విద్యార్థులను చితకబాదారని ఆలస్యంగా వెలుగు చూసింది. అంజుమన్ తరఖ్ఖీ ఎ తలీమ్ ఎ సదత్ బహ్రా అనే ఈ మదర్సా అతి పురాతనమైనదే కాక షియాలకు ఎంతో ఆరాధనీయ ప్రదేశం. అనాథాశ్రయంగా కూడా పనిచేస్తున్న ఈ మదర్సాకు చెందిన 72 ఏళ్ల మౌలానా అసద్ రజా హుస్సేనీపై పోలీసు బలగాలు దాడి చేసి తీవ్రంగా కొట్టాయి. మైనర్ పిల్లలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులపై పోలీసులు చేయిచేసుకుని తీవ్రంగా గాయపరిచారు. మౌలానాతోపాటు తొమ్మిదేళ్ల పిల్లలను సైతం బయటకు ఈడ్చుకొచ్చి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. పిల్లలను నగ్నంగా చేసి వారి వీపుపై లాఠీలు ఝలిపించారు.

ఆ తర్వాత మౌలానాతోపాటు దాదాపు 40 మంది పిల్లలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ మరోసారి వారిని చితకబాదారు. తమను టాయ్‌లెట్‌కు కూడా వెళ్లనీయకుండా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని మౌలానా మీడియాకు చెప్పారు. కొందరు విద్యార్థులకు కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తమ చేత జైశ్రీరాం, హర్ హర్ మహదేవ్ అంటూ నినాదాలు ఇప్పించారని ఆయన చెప్పారు. మదర్సాలోని కిటికీల అద్దాలను, సిసిటివిని, అల్మరాలను, కంప్యూటర్లను ధ్వంసం చేశారని, పరువులు, మంచాలను ముక్కలు ముక్కలు చేశారని ఆయన మీడియాకు వివరించారు. ఒకరోజు తర్వాత డిసెంబర్ 21న మౌలానా విడుదల కాగా మరి కొందరు పిల్లలను ఆ తర్వాత విడుదల చేశారు. 39 మంది అనాథలలో కేవలం 28 మందిని మాత్రమే పోలీసులు విడిచిపెట్టారని, మరో 11 మంది ఇప్పటికీ పోలీసుల చెరలోనే ఉన్నారని మౌలానా తెలిపారు.

Cops Cleric stripped in UP Madrasa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News