Thursday, May 2, 2024

నైగర్‌లో గ్రామస్థుల ఊచకోత

- Advertisement -
- Advertisement -

నైగర్‌లో గ్రామస్థుల ఊచకోత
దుండగుల కాల్పుల్లో 137 మంది మృతి

137 people killed near Malian Border in Niger

నియామి (నైగర్): ఆఫ్రికా దేశమైన నైగర్‌లో పొరుగున ఉన్న మాలి సరిహద్దుకు ఆనుకుని ఉన్న పలు గ్రామాలపై మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులు దాడి చేసి 137 మందిని చంపేశారు. కొద్దివారాల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొహమ్మద్ బజైమ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించాక ఈ సరిహద్దు గ్రామాల్లో ఊచకోతలు పెరగడం గమనార్హం. గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బజౌమ్ ఎన్నికయినట్లు నైగర్ రాజ్యాంగ న్యాయస్థానం గత ఆదివారం ప్రకటించిన రోజునే ఈ ఊచకోతలు సంభవించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దౌరహమానె జకరియా సోమవారం ప్రకటించారు. బజౌమ్ ఏప్రిల్ 2న పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిఉంది. పొరుగున ఉన్న మాలిలోని ఇస్లామిక్ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులతో నైగర్‌లో శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్న తరుణంలో ఆయన బాధ్యతలు చేపడుతుండడం గమనార్హం. గత జనవరిలో కూడా సరిహద్దు గ్రామాలపై జరిగిన దాడుల్లో వందమందికి పైగా మ౧తి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజా మారణకాండకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించుకోలేదు. పౌరులను హతమార్చిన సందర్భాల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు తామే బాధ్యులమని ప్రకటించుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. నైగర్, బుర్కినా ఫాసో మాలి దేశాల్లో ఇస్లామివ్వ్రవాదుల చేతుల్లో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

137 people killed near Malian Border in Niger

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News