Monday, April 29, 2024

హమాస్ కూడా అల్‌ఖైదా లాంటిదే: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ హమాస్ మిలిటెంట్ గ్రూపు .. అల్‌ఖైదాలాగానే కనిపిస్తోందన్నారు. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు.‘ దాడిలో 1000 మందికి పైగా చనిపోయారు. వీరిలో 27 మంది అమెరికన్లు ఉన్నారు. వీరు( హమాస్) చాలా దుర్మార్గులు. అల్‌ఖైదా ముష్కరుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. నేను ముందునుంచి చెబుతున్నట్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పూ లేదు.

హమాస్ దాడులనుంచి తమదేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది’ అని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. హమాస్ దాడులతో పాలస్తీనా పౌరులకు ఎలాంటి సంబంధం లేదనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలని బైడెన్ అన్నారు. ఈ యుద్ధం ఫలితంగా పాలస్తీనియన్లు కూడా తీవ్ర కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని ఆదుకోవలసిన అవసరం కూడా ఉందన్నారు. ఇక హమాస్ దాడుల తర్వాత కొంత మంది అమెరికా పౌరులు కనిపించకుండా పోయిన ఘటనపైనా బైడెన్ స్పందించారు. వారి ఆచూకీ తెలుసుకుని, క్షేమంగా తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News