Thursday, May 2, 2024

కడుపులో 16 కిలోల కణితిని తొలగించిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

కడుపులో 16 కేజీల కణితిని తొలగించిన వైద్యులు

16 KGs tumor in stomach in Mahaboobnagar

మన తెలంగాణ / అయిజ: మహబూబ్ నగర్ జిల్లా అయిజ మండలంలోని సాయి శివ ఆసుపత్రిలో  వృద్దురాలికి కడుపులో ఉన్న 16 కేజీల కణతిని తొలగించారు. అనంతపూర్ జిల్లాకు చెందిన సుబ్బమ్మ అనే వృద్ధురాలుకు ఎన్నో సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమె డాక్టర్ బ్రహ్మరెడ్డిని కలువడంతో స్కాన్ చేయగా కణతిని ఉందని గుర్తించారు. వెంటనే వైద్యుడు బ్రహ్మరెడ్డి, మత్తుమందు వైద్యులు డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. ఈ చికిత్స ఒటి అసిస్టెంట్స్ వీరేష్‌గౌడ్ , ఉమాపతి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతమైందని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అబులైస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News