Friday, May 3, 2024

ఇయర్‌ఫోన్స్‌తో డ్రైవింగ్ చేస్తే రూ. 20,000 జరిమానా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడిపితే రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఎపి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో వాహనదారులకు షాక్ తగిలింది. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే జరిమానా పడనుంది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, ఒక రైడర్ ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్ ధరించినట్లు కనిపిస్తే, పేర్కొన్న మొత్తంలో భారీ జరిమానా విధించాలని ఎపి రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని బైక్‌లపై యువత ప్రయాణించడం సర్వసాధారణమైపోయింది. ఇక్కడ ఏదైనా నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చు. దీన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఊహించని ఎత్తుగడ వేసింది. ఇదే సమయంలో సామాన్యులపై ఇంత పెద్దఎత్తున జరిమానాలు విధించాలని చూడకుండా, ప్రమాదాలకు మరో ప్రధాన కారణమైన ఏపీలో మంచి రోడ్లు వేయడంపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలని సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నిబంధన ఆగస్టు నుంచి అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News