Thursday, May 2, 2024

22వేల నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

Nominations

 

14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు శుక్రవారం నాడు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి తరపున పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ఎన్నికల కార్యాలయానికి చేరుకున్న వారందరి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం 7.45 గంటలకు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 21,850 నామినేషన్లు వచ్చాయి. ఇందులో ఆన్‌లైన్‌లో 574 నామినేషన్లు వచ్చినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ : జిల్లాల వారీగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు వచ్చిన నామినేషన్ల వివరాలను చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2392 నామినేషన్లు వచ్చాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 1910 నామినేషన్లు, నల్లగొండలో 1533 నామినేషన్లు, పెద్దపల్లిలో 1128 నామినేషన్లు, సూర్యాపేటలో 1073 నామినేషన్లు, నిజామాబాద్‌లో 1043 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 134 నామినేషన్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 187 నామినేషన్లు వచ్చాయి. ఇంకా పూర్తి స్థాయిలో జిల్లాల నుంచి సమాచారం రానందున ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. ఒక్కో వార్డుకు సగటున 6 మంది వరకు నామినేషన్లు దాఖలు చేశారు. 9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో 3 వేల మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు 18 వేల మందికి పైగా నామినేషన్లు వేశారు.

ఇక శనివారం అధికారులు నామినేషన్లను పరిశీలించి, సరిగ్గా దాఖలు చేసిన వారి జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 12వ తేదీన తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం ఉంది. 14న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. ఈనెల 22న పోలింగ్ జరగనుండగా 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అలాగే బీ ఫారాల విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఉపసంహరణ గడువు ముగిసే వరకు బీ-ఫారాలు ఇవ్వొచ్చని తెలిపింది. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారాలు సమర్పించవచ్చని పేర్కొంది. వివిధ జిల్లాల్లోని యుఎల్‌బిల (పట్టణ స్థానిక సంస్థలు) కు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్‌లో 387 నామినేషన్లు, జోగులాండ గద్వాల 294 నామినేషన్లు, కామారెడ్డి జిల్లాలోని యుఎల్‌బిలకు 564 నామినేషన్లు, కరీంనగర్‌లో 823, ఖమ్మంలో 291, కొమురం భీం ఆసిఫాబాద్ 182, మహబూబాబాద్ 470, మహబూబ్‌నగర్ 624, మెదక్ 554, మేడ్చల్ మల్కాజ్‌గిరి 1910, నాగర్‌కర్నూల్ 452, నారాయణ్‌పేట్ 525, నిర్మల్‌లో 528, రాజన్న సిరిసిల్ల 633, సంగారెడ్డి 981, సిద్ధిపేట 685, వికారాబాద్ 709, వనపర్తి 661, వరంగల్ రూరల్ 407, యదాద్రి భువనగిరి జిల్లాలోని యుఎల్‌బిలకు 659 నామినేషన్లు వచ్చినట్లు సాయంత్రం 7.45 గంటల వరకు విడుదల చేసిన ప్రకటనలో ఎస్‌ఇసి పేర్కొంది.

22 thousand Nominations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News