Thursday, April 18, 2024

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్…. 250 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

 

ఖానాపూరం: గొర్రెల మందపైకి టిప్పర్ దూసుకెళ్లడంతో 250 గొర్రెలు మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండంలో కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గొర్రెల యజమాని గురువారం సాయంత్రం తన గొర్రెలను మేపుకొని ఇంటికి వెళ్తుండగా పాకాల వాగు వంతెన వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ గొర్రెలపైకి దూసికెళ్లింది. ఈ ఘటనలో 250 గొర్రెలు దుర్మరణం చెందాయి. గొర్రెలు టిప్పర్ టైర్ల మధ్య ఇరుక్కపోవడంతో వాహనం నిలిచిపోయింది. వెంటనే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

250 Sheep Dead in Tipper Accident in Khanapur

 

250 Sheep Dead in Tipper Accident in Khanapur
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News