- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) పరిధిలో భారీగా అధికారులు బదిలీ అయ్యారు. జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా 27 మంది ఎసిపిలను బదిలీ చేస్తూ.. జిహెచ్‌ఎంసి ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ జిహెచ్ఎంసి (GHMC) కమీషనర్ ఆర్వీ కర్ణన్ ప్రక్షాళన చేశారు. ఈ మధ్యకాలంలో పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఖాళీల భర్తీతో పాటు పలువురు అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు చేశారు. సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న పలువురికి ఎసిబిగా ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన ఏడుగురు అధికారులకు సర్కిల్ ఎసిబిలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. అధికారులకు ఇండివీడియువల్‌గా కమీషనర్ బదిలీ ఆర్డర్స్ ఇచ్చారు.
బదిలీ అయిన ఎసిపిలు:
- మెహిదీపట్నం ఎసిబిగా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్‌కి బదిలీ
- గాజుల రామారం ఎసిపిగా సుమిత్రకు పోస్టింగ్
- అల్వాల్ ఎసిపిగా శ్రీనివాస్ రెడ్డికి పోస్టింగ్
- పావనికి కర్వాణ్ నుంచి సికింద్రాబాద్ ఎసిపిగా బదిలీ
- విజయలక్ష్మికి హయత్ నగర్ ఎసిపిగా బదిలీ
- నరేష్ హెడ్ ఆఫీస్‌కి ఎసిపిగా పోస్టింగ్
- సుధాకర్ సెక్షన్ నుండి ఎసిపిగా ప్రమోట్ చేస్తూ చంద్రయాన్ గుట్టకి పోస్టింగ్
- కూకట్‌పల్లి నుంచి రమేష్ కుమార్ గోషామహల్‌కు ఎసిపిగా బదిలీ
- తాండూరు నుండి లాలప్ప శేరిలింగంపల్లి జోనల్‌కి ఎసిపిగా బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ నుండి జీషణ్‌ను ఎసిపిగా ప్రమోట్ చేస్తూ కూకట్‌పల్లికి బదిలీ
- చంద్రయాన్ గుట్ట ఎసిపి భానుచందర్‌ని సంతోష్ నగర్‌కి బదిలీ
- గోషామహల్ ఎసిపి మంజుల సింగ్‌ను కులీకుతుబ్ షా ఎసిపిగా బదిలీ
- సంతోష్ నగర్ నుంచి స్వామికి మెహేధిపట్నంకి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ పి రమేష్‌కి కుత్బుల్లాపూర్ నుండి చందానగర్ బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ ఎండి అక్బర్‌కి అహ్మద్‌కు హయత్‌నగర్ నుండి శేరిలింగంపల్లి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ ఎస్‌కె సురేష్‌కి కుమార్ ఉప్పల్ నుండి జూబ్లీహిల్స్‌కి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ మహేందర్‌కి ఫలక్‌నుమా నుండి గోషామహల్‌కి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ జెకె నరేష్‌కి గోషామహల్ నుండి చార్మినార్‌కి బదిలీ
- కూకట్‌పల్లి నుండి సోమేశ్వర్‌కి హయత్‌నగర్ సర్కిల్‌కి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ తుల్జసింగ్‌కి గాజులరామారం నుండి ఉప్పల్ సర్కిల్‌కి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ నరేష్‌కి యూసుఫ్‌గూడ నుండి ఫలక్‌నుమాకి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ మధుకి పటాన్‌చెరు నుండి కూకట్‌పల్లికి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ బివి ప్రకాష్‌కి కార్వాన్ నుండి మెహిదీపట్నంకి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ రోహన్ ఠాకూర్ చందానగర్ పోస్టింగ్
- సెక్షన్ ఆఫీసర్ రామచందర్ సరూర్ నగర్ నుండి ఫలక్‌నుమాకి బదిలీ
- సెక్షన్ ఆఫీసర్ ముకేష్ సింగ్ చార్మినార్ నుండి గాజుల రామారంకి బదిలీ
- ప్రభావతికి కార్వాన్ సెక్షన్ ఆఫీసర్ గా పోస్టింగ్
- Advertisement -