Thursday, May 2, 2024

నేపాల్ లో భారీ భూకంపం.. 70మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. 6.4 భూకంప తీవ్రతతో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించడంతో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 70మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వందల మందికి పైగా గాయపడ్డారు. సంఘటనాస్థలాలకు వెంటనే రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన నేపాల్ ప్రధాని ప్రచండ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.కాగా, నెల వ్యవధిలో నేపాల్ లో రెండోసారి భూకంపం సంభవించింది.

మరోవైపు, నేపాల్ లో సంభవించిన భూకంపం.. ఢిల్లీ, యూపీ, బీహార్ రాష్ట్రాలను కూడా తాకింది. ఢిల్లీలో 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News