Tuesday, April 30, 2024

గ్రేసియాపై 74 శాతం రైతులు ఆసక్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాబోయే సీజన్‌లో మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను ఉపయోగించడం కొనసాగిస్తామని 74 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు సర్వేలో వెల్లడించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జిఎవిఎల్) క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సిఇఒ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ, గత సీజన్‌లో దాదాపు 95 శాతం మిర్చి పంటలు త్రిప్స్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఇతర కీటక సంహారులతో పంటను నాశనం చేసే తెగుళ్లు, త్రిప్స్‌పై గ్రేసియా శీఘ్ర నియంత్రణతో, విడుదల చేసిన 14 నెలల స్వల్ప వ్యవధిలో రైతుల్లో నమ్మకాన్ని సంపాదించటం సంతోషాన్నిస్తోందని అన్నారు. క్రిసిల్ భాగస్వామ్యంతో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జిఎవిఎల్) నిర్వహించిన స్వతంత్ర అధ్యయనం ప్రకారం, మొదటి స్ప్రే తర్వాత గ్రేసియా ప్రభావాన్ని రైతులు చూడటం తో 75 శాతం మంది రైతులు ఈ ఉత్పత్తిని తిరిగి కొనుగోలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News