Thursday, May 2, 2024

మువ్వన్నెల మురిపెం

- Advertisement -
- Advertisement -

75th independence day celebrations

వాడవాడల్లో రెపరెపలాడిన తివర్ణపతాకం
గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అన్ని రాజకీయ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా పండుగను చేసుకున్న అధికారులు, రాజకీయ నాయకులు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నగర వ్యా ప్తంగా కన్నుల పండువగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. 75వ స్వాతంత్ర దినోత్స వేడుకలను నగరవాసు లు ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్రం సిద్ధ్దించి 75 వసంతంలోకి అ డుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర సమర యోధుల నామసర్మణలతో నగరం మారు మోగిపోయింది. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో అందుబాటులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అదేవిధంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ ఆఫీసులు, కాలనీలు, బస్తీలలో జాతీయ జెండాను ఎగుర వేసి మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకంక్షాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో ఘననీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. దేశ తలసరి ఆదాయానికి కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అన్నారు. అంతకు ముందు సిఎం కెసిఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక స్మారక స్థూపం వద్ద అమర జవాన్లకు నివాళ్లు అర్పించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ శర్మన్, జిహెచ్‌ఎంసిలో న గర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా జలమండలిలో ఎండి దాన కిశోర్, హెచ్‌ఎండిఎలో సెక్రటరీ బి.ఎం.సంతోష్ జాతీయ జెండాను ఎగురవేశారు. నగర పోలీసు కమిషనరేట్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య పరిపాలన అధికారి సుధారాణి, సైబరాబాద్ పోలీసు కమిషరేట్‌లో సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సెఫ్టీ వింగ్ డిసిపి సి. అనసూయజాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. టిజిఓ జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణయాదవ్, టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌లు తమ తమ జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. నగరంలోని వివిధ మండలాలలో ఆయా తహసిల్దార్లు జాతీయ జెండాలను ఎగురువేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News