Thursday, May 2, 2024

పశ్చిమబెంగాల్‌ నుంచి 8 లక్షలు, ఒడిశా నుంచి 2 లక్షల మంది తరలింపు

- Advertisement -
- Advertisement -

8 lakh evacuation from Bengal and 2 lakh from Odisha

పశ్చిమబెంగాల్‌లో 5 వేల మంది గర్భిణులు ఆస్పత్రులకు తరలింపు
జార్ఖండ్‌కు ఈ విపత్తు ఎదురుకావడం ఇదే మొదటిసారి

న్యూఢిల్లీ : యాస్ తుపాను తీవ్ర రూపం దాలుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు లోతట్టు ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పశ్చిమబెంగాల్ లోని 14 జిల్లాల్లో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. ఒడిశా ప్రభుత్వం 2 లక్షల మందిని ఇంతవరకు లోతట్టు ప్రాంతాల నుంచి తరలించింది. మంగళవారం సాయంత్రం నుంచి యాస్ తుపాను చాలా తీవ్రంగా మారుతోందని, తుపాను వచ్చే ముందు తీరం దాటిన తరువాత ఆరు గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని, చాంద్‌బాలి ప్రాంతం ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఉండవచ్చని బుధవారం తీరం దాటవచ్చని ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరించారు. ఒడిశా లోని భద్రక్ జిల్లా ధామ్ర, చాంద్‌బాలి మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్‌లో 74,000 మంది అధికారులు, వర్కర్లు , 2 లక్షల మందికి పైగా పోలీసులు, వాలంటీర్లు, తుపాన్ ముప్పును ఎదుర్కోడానికి, సహాయచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్టంలో 4000 ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ విపత్తులో గర్భిణులకు ఎలాంటి ఆపద రాకుండా ఉండడానికి దాదాపు 5000 మంది గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్చారు. పశ్చిమబెంగాల్ సరిహద్దు లోని జార్ఖండ్ రాష్ట్రంలో తూర్పు, పశ్చిబ సింగ్భమ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎనిమిది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కొల్హాన్ డివిజన్ లో నియామకమయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రం ఇలాంటి తుపాన్ విపత్తును ఎదుర్కోవలసి రావడం ఇదే మొదటిసారి. జార్ఖండ్‌లో 110 నుంచి 120 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి సీనియర్ సైంటిస్టు జెనామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News