Thursday, October 10, 2024

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని అంతరాష్ట్ర రహదారి పై గల లక్ష్మింపూర్ చెక్‌పోస్టు వద్ద బుధవారం అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను తలమడుగు పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర , ఒడిస్సా బార్డర్ నుండి మహారాష్ట్రకు ( యుకె08సిబి 5318) 292 ఫ్యాకెట్‌లలోని దాదాపు 9 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తలమడుగు పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు.జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం .. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 2.25 కోట్లు ఉంటుందన్నారు. కంటైనర్ డ్రైవర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వసీం అన్స్‌రి (ఎ3) , కంటైనర్ క్లినర్ ఆర్మన్( ఎ4) అరెస్టు చేయడం జరిగిందన్నారు.

మిగిత ఆరుగురి కోసం గాలిస్తున్నామని అందులో ప్రధాన నిందితుడు ఎ1 ఒడిస్సాకి చెందిన ఆశిష్, ఎ2 ఉత్తర ప్రదేశ్‌కి చెందిన పండిట్‌జీ, ఎ5, ఎ6 మహారాష్ట్రలోని బుల్డనా దులే జిల్లాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు, ఎ7 ఉత్తరకండ్‌కుచెందిన అనుషుజైన్, ఎ8 సోనుఆన్స్‌రిలు ఉన్నట్లు తెలిపారు. నిందితులందరి పై తలమడుగు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 8(సి)ఆర్‌డబ్లు20,(ii)(c)NDPC చట్టం ప్రకారం 1985 కింద కేసులు నమోదు చేశామన్నారు. త్వరలోనే మిగితా నిందితులందరిని పట్టుకొని కఠినమైన శిక్షలు పడేలా చూస్తామన్నారు.ఈ సమావేశంలో ఎస్పీతో పాటు డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు ఫణిధర్ ,సాయినాథ్ , సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ చంద్ర శేఖర్ , ఎస్సైలు అంజమ్మ , ముజాయిద్, విష్ణువర్థన్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News