Monday, June 10, 2024

నేనూ ఆ మాత్రలు వేసుకొంటున్నా

- Advertisement -
- Advertisement -

Trump says he is taking Hydroxychloroquine

 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకొంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గత పది రోజులనుంచి తాను ఈ మాత్రలు వేసుకొంటున్నట్లు చెప్పారు. తనలో ఇప్పటివరకు ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదన్నారు. శ్వేతసౌధం వైద్యుడు సూచించనప్పటికీ తాను ఈ ఔషధం వాడుతున్నట్లు ట్రంప్ చెప్పారు. తాను క్లోరోక్విన్ తీసుకోవాలని అనుకొంటున్నట్లు వైద్యుడితో చెప్పినప్పుడు ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు.

రోజుకు ఒక మాత్ర చొప్పున వేసుకొంటున్నానని ట్రంప్ చెప్పారు. కరోనాపై పోరుతో ముందు వరసలో ఉన్న చాలా మంది ఈ ఔషధం వాడుతున్నారని తెలిపారు. వారిలో మెరుగైన ఫలితాలు కనిపించాయని, అందువల్లే తాను కూడా వాడుతున్నాని చెప్పారు.హైడ్కా క్లోరోక్విన్ మాత్రలు వేసుకొంటున్నానని ట్రంప్ చెప్పి వెంటనే శ్వేతసౌధం వైద్య వర్గాలు కూడా దీనిపై స్పందించాయి. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ప్రకటించాయి.ఆయన తరచూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొంటున్నారని, ఇప్పటివరకు అవన్నీ నెగెటివ్ వచ్చాయని వైట్‌హౌస్ సీనియర్ వైద్యుడు డాక్టర్ సీన్ పి కాన్లీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News