Tuesday, April 30, 2024

ఈ వర్షకాలం పంటతోనే నియంత్రిత సాగు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to Oppose NDA's New Power bill

హైదరాబాద్: ఈ వర్ష కాలం పంటలతోనే తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి సీజన్ లో ఇదే విధానం కొనసాగించాలని,  మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని సిఎం కెసిఆర్ అన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి.. అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. సూచనలు చేయడానికి వ్యవసాయ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే కాటన్ రీసెర్చ్ డెవలప్ మెంట్ సెంటర్, పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పంటల కాలనీకోసం నేలల విభజన జరగాలని.. ఆలూ, అల్లం, వెల్లిపాయల సాగను ప్రోత్యహించాలని సిఎం కెసిఆర్ అన్నారు.

Controlled cultivation begin from this monsoon crop: KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News