Monday, June 17, 2024

లాక్‌డౌన్ సమయంలో రోడ్ల నిర్మాణం పూర్తి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana turn as Investment Centre in World

హైదరాబాద్: లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకొని జిహెచ్‌ఎంసి రోడ్ల లేయింగ్, నిర్మాణం వంటి పనులను పూర్తి చేశామని మంత్రి కెటిఆర్ తెలియజేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై కెటిఆర్ మాట్లాడారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని ఎంఎల్‌ఎలతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఎస్‌ఆర్‌డిపి పనులు ద్వారా అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయని తెలిపారు. ముఖ్యంగా ఎల్‌బినగర్ చౌరాస్తా వంటి పలు చోట్ల మొత్తం రూపురేఖలు మారిపోయాయన్నారు. అతివేగంగా ఇన్ ఫ్రాస్టక్చర్ పనులు జరిగాయని కెటిఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, నియోజకవర్గ ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News