Thursday, May 2, 2024

ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా, కెనిన్

- Advertisement -
- Advertisement -
serena williams Sofia Kenin in pre quarter finals
థిమ్, అజరెంకా ముందుకు, మాడిసన్ కీస్ ఔట్, యూఎస్ ఓపెన్

న్యూయార్క్: అమెరికాకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సెరెనా విలియమ్స్, సోఫియా కెనిన్‌లు ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రియా ఆశాకిరణం, రెండో సీడ్ డొమినిక్ థిమ్ కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. ఇక మహిళల విభాగంలో మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. కాగా అమెరికాకు చెందిన ఏడో సీడ్ మాడిసన్ కీస్ అర్ధాంతరంగా ఆట నుంచి తప్పుకుంది. దీంతో ఫ్రాన్స్‌కు చెందిన అలిజె కొర్నెట్ ముందంజ వేసింది. మరోవైపు అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియోఫె కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు.

serena williams Sofia Kenin in pre quarter finals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News