Sunday, April 28, 2024

గుట్కా విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Three Arrested for Selling Gutkha At Hyderabad

హైదరాబాద్: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను నగర వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేశారు. బోరబండ, లంగర్‌హౌస్,ఆసిఫ్‌నగర్‌లో దాడులు చేసి రూ.10.70లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బోరబండకు చెందిన ఎండి ఫజల్ అహ్మద్ ఎల్‌కె ట్రేడర్స్ పేరుతో సిగరేట్ల వ్యాపారం చేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో నిషేధిత పోగాకు వస్తువులు, గుట్కా విక్రయిస్తున్నాడు.బాలానగర్‌కు చెందిన గుట్కా వ్యాపారి రమేష్ ఇతడికి గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాడు. పది రోజుల క్రితం నిందితుడు రూ.10లక్షల విలువైన టొబాకో వస్తువులు, గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి ఎల్‌కె ట్రేడర్స్‌లో నిల్వ చేశాడు. వాటిని నగరంలోని వివిధ షాపులకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లంగర్‌హౌస్‌కు చెందిన ఆంజనేయులు వ్యాపారం చేస్తున్నాడు.

గుట్కా, జర్ధా వస్తువులు విక్రయిస్తున్నాడు. పోలీసులు దాడులు చేసి రూ.35,000 విలువైన గుట్కా, జర్ధా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్న ఎండి అస్లాం నిషేధిత జర్ధా, గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నాడు. నిందితుడి వద్ద నుంచి రూ.35,000 విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఆర్ నగర్, ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు,ఎస్సైలు రంజిత్, ముజఫర్ అలీ తదితరులు దాడులు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News