Sunday, April 28, 2024

పెళ్లి ముహూర్తం ఖరారు

- Advertisement -
- Advertisement -

Mega daughter Niharika wedding date has been fixed

హైదరాబాద్: మెగా డాటర్ నీహారిక కొణిదెల పెళ్లి తేదీ, వేదిక ఖరారైంది. గుంటూరుకు చెందిన ఐజి కుమారుడు చైతన్యతో నిహారిక నిశ్చితార్థం ఇంతకుముందే కాగా.. ఇప్పుడు ఇరువైపులా కుటుంబ సభ్యులు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఐదు నక్షత్రాల హోటల్ ఉదయ్ విలాస్‌లో వివాహం జరుగనుంది. ఈ మేరకు పెద్దలు పెళ్లి వేదికను చేశారని తెలిసింది.

డిసెంబర్ 9న సాయంత్రం 7.15 గంటలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారని తెలిసింది. ఈ వివాహ వేడుక కోవిడ్ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతలను పాటిస్తూ.. ఇరు కుటుంబ సభ్యులు, పరిమిత అతిథుల సమక్షంలో జరుగనుంది. మొత్తం మెగా కుటుంబం నిహారిక, – చైతన్యల వివాహానికి హాజరుకానుంది. ఇక పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటిస్తుందా? అంటే దానికి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇక నిహారిక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News