Friday, May 3, 2024

మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష రద్దు

- Advertisement -
- Advertisement -

Cancelled of entrance test for minority gurukula school

5 నుంచి 8 తరగతులు, జూనియర్ కళాశాలల్లో
ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ప్రవేశ పరీక్షకు బదులు డ్రా పద్దతిలో ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫియుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మైనార్టీ పాఠశాలల్లో లక్కీ డ్రా నిర్వహించి దరఖాస్తులు చేపడతామని తెలిపారు. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా మైనార్టీ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత సీట్లు మిగిలితే అర్హులైన విద్యార్థుల నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.

మే 20 వరకు దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతితో పాటు ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫియుల్లా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 30(శుక్రవారం) నుంచి మే 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తలు స్వీకరిస్తామని తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు జూన్ 1న, 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు జూన్ 3వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనునన్నట్లు పేర్కొన్నారు.

అలాగే జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 6వ తేదీన మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని అన్నారు. జూన్ 8 నుంచి 12 వ తేదీ వరకు సిర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 14 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు www.tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో లేదా 040 23437909 హెల్ప్‌లైన్ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News