Tuesday, April 30, 2024

భారత్‌కు ఫైజర్ భారీ సాయం

- Advertisement -
- Advertisement -

Pharma company Pfizer announces huge aid to India

చరిత్రలో ఎన్నడూ లేనంతా రూ.510 కోట్ల ఔషధాల విరాళం

న్యూఢిల్లీ/న్యూయార్క్ : ప్రపంచస్థాయి ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. కొవిడ్ చికిత్సలో వినియోగించుకునేందుకు అవసరం అయిన ఔషధాలను అందచేయనుంది. దాదాపు రూ 510 కోట్లు పైబడి విలువైన ఈ మందులను అమెరికా,ఐరోపా ఆసియాలలోని సంస్థ పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు పంపిస్తారు. భారత్‌లో ప్రస్తుత కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత దశలో సంస్థ ఈ సాయానికి దిగుతున్నట్లు కంపెనీ సిఇఒ ఆల్బర్ట్ బోర్లా తెలిపారు. ఈసాయం ఇంతటితో ఆగదని భారత ప్రభుత్వానికి ముందుగా తెలియచేసి, అవసరం అయిన ఔషధాలను అందించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొవిడ్ బాధితులకు ఔషధాలు ఉచితంగా అందించేందుకు వీలుగా ఈ సాయం ప్రకటించినట్లు, సాధ్యమైనంత త్వరగా సరఫరాలు భారత్‌కు చేరుతాయని బోర్లా తెలిపారు. బయో ఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్ సంస్థ కొవిడ్ టీకాను రూపొందించింది.

ఇది ప్రపంచంలోని కొన్ని దేశాలలో వాడకపు అనుమతి పొందింది, భారత్‌లో కూడా అనుమతికి ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగానే కంపెనీ నిర్వహణాధికారి తెలిపారు. దీనికి సంబంధించి నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నట్లు , అనుమతి దక్కనట్లు కంపెనీ తెలిపింది. ముందుగా భారతదేశంలో స్థానికంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ తరువాతనే వీటిని ఇక్కడ వాడకానికి అనుమతిని ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే సెకండ్ వేవ్ కొవిడ్‌కు ముందు ఈ కేంద్రం ఈ విధంగా తేల్చిచెప్పినా ఇప్పుడు ప్రస్తుత దశలో అత్యవసరంగా వివిధ రకాల టీకాలు అవసరం ఉండటంతో అత్యవసరంగా కేంద్రం విదేశీ టీకాల దిగుమతికి అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో ఫైజర్ టీకాకు కూడా దేశంలో అధికారపు వాడకపు అనుమతి వస్తుందని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News