Wednesday, May 15, 2024

పుట్టిన రోజు వేడుకలో కాల్పులు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in shooting in America

వాషింగ్టన్‌ : అమెరికాలోని న్యూజెర్సీలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి.  పుట్టిన రోజు వేడుకలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో ఫెయిర్‌ ఫీల్డ్‌ టౌన్‌షిప్‌లో కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన 12 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ విచారం వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News