Friday, May 3, 2024

యాంటీబాడీలు తగ్గినా కరోనా నుంచి వ్యాక్సిన్ల రక్షణ

- Advertisement -
- Advertisement -
Vaccine protection against corona reduction of antibodies
లండన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

లండన్ : కరోనాను కట్టడి చేయడంలో శరీరంలో యాంటీబాడీలు కీలక పాత్ర వహిస్తాయి. వైరస్ బారిన పడి కోలుకోవడం ద్వారా లేదా వ్యాక్సిన్ పొందడం వల్ల యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అయితే ఇవి శరీరంలో ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. లండన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 2 నుంచి 3 నెలల్లో యాంటీబాడీల స్థాయి కాస్త తగ్గుతుందని వెల్లడైంది. అయినప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్ధం గానే పనిచేస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ది లాన్సెట్ ’లో ఈ నివేదిక వెల్లడైంది. శరీరంలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిలను అంచనా వేసేందుకు యూనివర్శిటీ కాలేజీ లండన్ (యుసిఎల్) పరిశోధకులు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను తీసుకున్న 600 మందిపై అధ్యయనం నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకున్న ఆరు వారాల తరువాత వారిలో యాంటీబాడీల స్థాయి తగ్గడం కనిపించింది. 10 వారాల తరువాత దాదాపు 50 శాతం స్థాయి పడిపోయింది. అయినా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్ధం గానే పనిచేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపధ్యంలో బూస్టర్ డోసు అవసరాన్ని స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో నమూనాలను తీసుకుని అధ్యయనం చేపట్టామని, ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరింత అధ్యయనం అవసరమని అభిప్రాయ పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News