Monday, June 17, 2024

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత

- Advertisement -
- Advertisement -

5.2 Magnitude Earthquake hits Andaman and Nicobar Islands

న్యూఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్‌ బేలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడించింది. భూమి కంపిచడంతో రిక్టర్‌ స్కేలుపై 5.2 తీవ్రత నమోదయిందని తెలిపింది. క్యాంప్‌బెల్‌ బేకు తూర్పు దిక్కున 246 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 63 కిలోమీటర్ల లోతులో భూ కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. గత బుధవారం కూడా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 3.9 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే.

5.2 Magnitude Earthquake hits Andaman and Nicobar Islands

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News